హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు జన్మదినాన్ని పురసరించుకొని బుధవారం దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనం పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దళిత క్రైస్తవ అభ్యున్నతి కోసం, డాక్టర్ అంబేదర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని దళిత క్రైస్తవ సంఘాలు పెద్దఎత్తున నిర్వహించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్, దళిత క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.