హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ మూలాలను చిత్తు చేయడమే లక్ష్యంగా జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర నార్కోటిక్ బ్యూరోతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిం చేందుకు సిద్ధమయ్యాయి. నాలుగున్నర నెలల్లో 411 ఎన్డీపీ ఎస్ కేసులను నమోదు చేసి, 595 మందిని అరెస్టు చేసింది.