ములుగు : జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయనే వదంతులు స్థానికంగా కలకలం రేపాయి. మంగపేట మండలం కమలాపురానికి చెందిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు ఒమిక్రాన్ లక్షణాలు ఉండటంతో ర్యాపిడ్ టెస్టులు చేయగా కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది.
అయితే స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వీరిని ఒమిక్రాన్‌గా నిర్ధారించలేమని వైద్యులు తెలిపారు. ఆర్టీపీసీఆర్, జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్ష ల ద్వారా మాత్రమే ఒమిక్రాన్ నిర్ధారణ అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు మాస్కులు ధరిస్తూ కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.