హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ -2003 టీచర్లకు సీసీఎస్ పథకాన్ని మినహాయించి, పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పీఆర్టీయూటీఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి బీరెల్లి మలాకర్రావు సోమవారం సచివాలయంలో సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు.
1-1-2004 కన్నా ముందే నియామక ప్రక్రియ పూర్తయ్యి, తదుపరి విధుల్లో చేరిన వారికి పాత పెన్షన్‌ను మంజూరు చేయాలని ఇటీవల కేంద్రం జీవో- 57ను జారీ చేసిందని గుర్తుచేశారు. సీపీఎస్ సొమ్ములను జీపీఎఫ్ ఖాతాలోకి, ప్రభుత్వ వాటాను ప్రభుత్వ ఖాతాలోకి జమయ్యే విధంగా చొరవ తీసుకోవాలని వారు విజ్ఞఫ్తి చేశారు. సీఎస్‌ను కలిసిన వారిలో పీఆర్టీయూ టీఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు అదరాసుపల్లి శశిధర్‌శర్మ, ప్రధానకార్యదర్శి పంతం వెంకటరాజం, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, జగదీశ్ న్నారు.