హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ పథకాల పురోగతిపై మంగళవారం ఆయన సచివాలయంలో సమీక్ష జరిపారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌లో తకువ పురోగతి ఉన్న కంపెనీలపై తగు చర్యలు తీసుకోవాలని, ప్లాంటేషన్ పురోగతిపై ఆయిల్ పామ్ కంపెనీలతో ప్రతి రోజూ సమీక్ష నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. జిల్లాలవారీగా నిర్దేశించుకున్న లక్ష్యాలను మార్చిలోగా సాధించాలని చెప్పారు. ఉద్యాన పంటల కోసం సబ్సిడీపై డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లు అందజేయాలని, ఇందుకోసం రైతుల నుంచి 90 రోజులపాటు దరఖాస్తులు స్వీకరించాలని, ప్రతిరోజూ రూ.కోటి విలువైన డ్రిప్ పరికరాలు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.
నై