శాయంపేట, సెప్టెంబర్ 21 : పేదలకు పంపిణీ చేసే బియ్యం భద్రమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గోదాములో నిల్వ చేయాల్సిన పీడీఎస్ రైస్‌ను ఆరుబయట పెట్టారు. కనీస భద్రతా చర్య లు తీసుకోకపోవడంతో కోతుల గుంపు చేరి చిందరవందర చేస్తున్నాయి. వర్షం పడితే తడిసేలా పెట్టడంపై గోదా ము అధికారుల నిర్లక్ష్యం ఉన్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లి శివారులో 5 వేల టన్నుల గోదాము గత ప్రభుత్వం లో నిర్మించారు.
కొంతకాలంగా భూపాలపల్లి జిల్లాకు చెందిన పౌర సరఫరాల సంస్థ ఈ గోదామును అద్దెకు తీసుకున్న ది. ఇందులో పేదలకు అందించే రేషన్ బియ్యం లారీల్లో తెచ్చి నిల్వ చేస్తున్నారు. ఇక్కడి నుంచి భూపాలపల్లి జిల్లాలోని ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యాన్ని తరలిస్తున్నారు. ఆరుబయట వేలాది బస్తాలను నిల్వ చేశారు. వర్షం వస్తే బియ్యం బస్తాలు తడిసేలా ఉన్నాయి.
వీటిపై ఎ లాంటి టార్పాలిన్ షీట్లు కప్పలేదు. మరో పక్క బస్తాలను నిల్వ చేసి వాటిపై మా త్రం టార్పాలిన్లు కప్పారు. ఊరి బయట ఉండటంతో వందల సంఖ్యలో కోతులు బియ్యం బస్తాలపై పడి తినేస్తున్నాయి. గోదాములో బయట వేలాదిగా బియ్యాన్ని నిల్వ చేయడం, గేటుకు తాళం వేసి ఉండటం రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. పొద్దంతా కోతులు బీభత్సం చేస్తున్నా చూసేవారు లేకపోవడం గమనార్హం. పీడీఎస్ రైస్‌ను ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వదిలేశారో అధికారులకే తెలియాలంటున్నారు స్థానికులు, ఉన్నతాధికారులు స్పందించి పీడీఎస్ రైస్‌ను కాపాడాలని కోరుతున్నారు.