జనగామ : నిరుపేదలకు పైసా ఖర్చులేకుండా సొంతింటి కలను నిజం చేసేందుకు నాడు కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు(Double bedroom houses) నిర్మించి అందజేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్ ఇండ్ల నుంచి నిరుపేదలను బలవంతంగా బయటకు పంపుతున్నారు. తాజాగా జనగామ(Janagama) జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు (జే) గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను రెవెన్యూ సిబ్బంది ఖాళీ చేయించి(Evacuated ) ఇండ్లకు తాళాలు వేశారు. కాగా, ఉన్నపళంగా రెవెన్యూ, పోలీస్ అధికారులు అక్రమంగా వచ్చి ఇండ్లలోకి చొరబడి ఇంటి సామగ్రి బయట పడేస్తే మేము ఎక్కడికి పోవాలని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసినా అధికారులు ఇప్పటి వరకు పట్టాలు అందజేయలేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దయ తలచి మాకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు పట్టాలు ఇవ్వాలని బాధితులు వేడుకుంటున్నారు. ఓటు వేసి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డిని గెలిపిస్తే ఇదా ప్రతిఫలం అని బాధిత కుటుంబాలు విలపిస్తున్నాయి.
పాలకుర్తిలో గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు
ఓటు వేసి ఎమ్మెల్యే యశాశ్విని రెడ్డిని గెలిపిస్తే ఇదా ప్రతిఫలం అని విలపిస్తున్న కుటుంబాలు.
జనగామ జిల్లా – పాలకుర్తి మండలం లోని తొర్రూరు (జే) గ్రామంలో… pic.twitter.com/U2VzBniGNx
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024