మద్దూర్, అక్టోబర్ 19 : నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన రహదారులను రెండు లేన్లుగా మార్చే క్రమంలో రెణివట్ల చౌరస్తా నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం వరకు రెండు వైపులా 35 ఫీట్ల చొప్పున 70 ఫీట్ల రోడ్డును విస్తరిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి రెణివట్ల చౌరస్తా నుంచి ప్రభుత్వ దవాఖాన ప్రహరీ వైపు 35ఫీట్లు కాకుండా అవతలి వైపు ఉన్న దుకాణాలను ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు జేసీబీతో కూల్చారు. దీంతో బాధితులు ఆదివారం మద్దూరు పాత బస్టాండ్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దుకాణాలను కూల్చడం ఏమిటని ప్రశ్నించారు. 2గంటలు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు ఆందోళన కారులను వెళ్లగొట్టారు.