శంషాబాద్ రూరల్, జనవరి 30: ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణానికి సర్వే నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులను కోత్వాల్‌గూడ వద్ద రైతులు, నాయకులు శుక్రవారం అడ్డుకున్నా రు. గతంలో ఓఆర్ఆర్ కోసం భూ ములు ఇవ్వగా, తాజాగా రేడియల్ రోడ్డు పేరుతో మరోసారి అదే గ్రా మానికి చెందిన రైతుల భూమి 53 ఎకరాల 33 గుంటలు పోతున్నది. సర్వే చేయడానికి వచ్చిన ఆర్ఐలు కృష్ణ, మహిపాల్‌రెడ్డిని అడ్డుకున్నా రు. అక్కడికి చేరుకున్న తహసీల్దార్ రవీందర్దత్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినిపించకపోవడంతో చేసేదేమీలేక అధికారులు వెనుదిరిగారు.