హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : నేరెళ్ల, రామచంద్రాపురంలో 8 మంది దళితులపై దాడి వ్యవహారంపై సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు జరిపించాంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో తమ వాదనలు వినాలంటూ బాధితుడు కోలా హరీశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్రహింసల కేసులో పోలీసుల పాత్ర లేదంటూ ఐజీ ఇచ్చిన నివేదిక తప్పని తెలిపారు. నేరెళ్ల ఘటనలో పోలీసులపై కేసు నమోదు చేయాలని కోరుతూ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. విచారణను ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.