ముషీరాబాద్, మార్చి 20: ఢిల్లీలో ఈ నెల 22న అఖిల భారత ఓబీసీ ఉద్యోగుల ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ల కల్పన, జనగణన, క్రీమీలేయర్ నిబంధన తొలగింపు, రిజర్వేషన్ల పెంపు వంటి డిమాండ్లపై సమావేశంలో చర్చిస్తామని పేర్కొన్నారు. 29 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగ సంఘాల నాయకులు, పలువురు ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరవుతారని కృష్ణయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.