హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(ఈఆర్సీ) సభ్యులుగా నియమితులైన కే రఘు, సీ శ్రీనివాసరావు సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కొత్త సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ్ భవన్లో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈఆర్సీ టెక్నికల్ సభ్యుడిగా కే రఘు, ఫైనాన్స్ సభ్యుడిగా సీ శ్రీనివాసరావును నియమిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. కే రఘు, సీ శ్రీనివాసరావుకు విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) శుభాకాంక్షలు తెలిపింది. అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపకంటి అంజయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం కొత్త సభ్యులను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపింది.