హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టుపై 22న ఎన్‌డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు బేసిన్‌లోని అన్ని రాష్ర్టాలకు సమాచారమిచ్చింది. జీసీ లింక్ ప్రాజెక్టుపై ఇప్పటికే పలు దఫాలుగా ఎన్‌డబ్ల్యూడీఏ బేసిన్‌లోని తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ర్టాలతో టాస్క్‌ఫోర్స్ కన్సల్టెన్సీ సమావేశాన్ని నిర్వహించి, సాంకేతిక అంశాలపై చర్చించింది.
దీనిపై ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. జీసీ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంటెక్ పాయింట్‌ను ఖరారు చేయలేదు. అదేవిధంగా మళ్లించే జలాల్లో బేసిన్ రాష్ర్టాలకు సంబంధించి నీటి వాటాలపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేయాలని భావించారు. గత జూన్‌లోనే నిర్వహించాల్సి ఉండగా, వాయిదా పడింది. ఆ సమావేశాన్ని 22న జలసౌధ వేదికగా నిర్వహించాలని నిర్ణయించింది.