హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 42,244 మంది నర్సులు దరఖాస్తు చేసుకోగా.. 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్థులు సాధించిన మారుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. https:// mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్సైట్లో మారులను అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ మారుల వివరాలను చెక్ చేసుకోవాలని మెడికల్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
కరీంనగర్ కార్పొరేషన్, మే 5 : ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ సూచించారు. సోమవారం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిక్కులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణంలో దేశం యుద్ధం చేయడానికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా, దేశ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు తమకు తోచినంత ఆర్థికంగా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు.