హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కన్వీనర్ కోటా ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య లెక్క తప్పింది. సీట్ల సంఖ్యలో తేడాలతో గందరగోళం నెలకొన్నది. పది రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,403 సీట్లు తగ్గాయి. ఎప్సెట్ వెబ్కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 10న నిర్వహించిన తుది విడత సీట్ల కేటాయింపు సమయంలో మొత్తం 91,649 సీట్లున్నట్టు సాంకేతిక విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.
తాజాగా శుక్రవారం సెంట్రలైజ్డ్ ఇంటర్న్ ైస్లెడింగ్ సీట్ల కేటాయింపు సందర్భంగా మొత్తం సీట్ల సంఖ్య 90,246 ఉన్నట్టు ప్రకటించారు. అంటే పన్నెండు రోజుల్లోనే 1,403 సీట్లు తగ్గాయన్న మాట. అసలింతకు ఈ వ్యవధిలో ఏం జరిగింది. ఈ సీట్లు ఏమైనట్టు అన్న ప్రశ్నలొస్తున్నాయి.
ఇంజినీరింగ్లో సీటు వచ్చినా ఈ సారి 1,815 మంది సీట్లు వదులుకున్నారు. వీరంతా ఇప్పటికే కట్టిన ఫీజులు కోల్పోనున్నారు. ఇంటర్నల్ ైస్లెడింగ్కు ముందు 11,638 సీట్లు మిగలగా, తాజాగా ఇంటర్నల్ ైస్లెడింగ్ తర్వాత 13,453 సీట్లు మిగిలాయి. ఇంటర్నల్ ైస్లెడింగ్ తర్వాత ఈ సారి మొత్తంగా 85.1% సీట్లు నిండాయి.