హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) https://neet.nta.nic.in వెబ్సైట్లో ఈ అడ్మిట్‌కార్డులను పొందుపరిచింది.
నీట్ పరీక్షను మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 26లక్షల మంది విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. నిరుడు 22లక్ష మంది దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది నాలుగు లక్షల మంది అధికంగా దరఖాస్తు చేసుకున్నారు.