హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు, ఎన్ఐటీలుసహా కేంద్రప్రభుత్వ నిధులతో నడిచే విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)మెయిన్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రారంభించింది. బీఈ, బీటెక్ కోర్సుల ప్రవేశ పరీక్ష షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటించడమే కాకుండా అదే రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఆశావహులు ఈ నెల 25 రాత్రి 9గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 25వ తేదీ రాత్రి 11:50గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లించవచ్చు.
జేఈఈ మెయిన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3నుంచి రాత్రి 6 గంటల వరకు రెండో సెషన్లో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు https ://jeemain.nta.nic. in వెబ్‌సైట్‌ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో ఏవైనా ఇబ్బందులుంటే 011 -40759000/011, 69227700 నంబర్‌ను సంప్రదించవచ్చని ఎన్టీఏ వర్గాలు తెలిపాయి.