హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస భారతీయులు కీలక పాత్ర పోషించాలని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం డల్లాస్‌లో ఎన్నారైలు ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎన్నారైలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి తీరును, సీఎం కేసీఆర్ దార్శనికతను వివరించారు. డల్లాస్ డెవలప్మెంట్ ఫోరం, భారాస తెలంగాణవాదుల సంఘం సంయుక్తంగా వకుళాభరణాన్ని సత్కరించాయి.