కమ్మర్పల్లి, ఏప్రిల్ 28 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్‌క్యూఏఎస్ (నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్) జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. 90.80 శాతం స్కోరుతో ఈ అవార్డు సాధించినట్లు చౌట్పల్లి పీహెచ్సీ వైద్యుడు రతన్ సింగ్, హెచ్‌ఈవో సత్యనారాయణ తెలిపారు.
జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంరక్షణ, ప్రసవాలు, రోగుల పట్ల తగు శ్రద్ధ, చికిత్స, తదితర అంశాల్లో దవాఖాన పని తీరును కేంద్ర బృందం పరిశీలించి ఇచ్చిన మార్కుల ఆధారంగా ఈ గుర్తింపు లభించిందని వివరించారు.
ఈ గుర్తింపు సాధించేలా పని చేయడంలో తమను ప్రోత్సహించిన డీఎంహెచ్‌వోకు, డిప్యూటీ డీఎంహెచ్‌వోకు ధన్యవాదాలు తెలిపారు. ఇందులో సిబ్బంది కృషి, సహకారం ఎంతో ఉందన్నారు. జాతీయస్థాయి గుర్తింపు లభించడంతో రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు ప్రశంసా పత్రం అందివ్వనున్నారు.