మూడు విద్యా సంస్థలతో డా.బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒప్పందాలు
బంజారాహిల్స్,జూన్ 6: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంబీఏతో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సులను అందించేందుకు మూడు విద్యా సంస్థలతో అవగాహన ఒప్పందం కుదిరింది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొ.కె.సీతారామారావు సమక్షంలో అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్, కిమ్స్ ఎడ్యుకేషన్ సొసైటీ, దారుస్సలాం ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌తో వేర్వేరుగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు.
విద్యార్థులకు మరింత మెరుగైన కోర్సులను అందించేందుకు ఈ ఒప్పందాలు ఉపయోగపడతాయని వైస్ చాన్స్‌లర్ ప్రొ. సీతారామారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొ.సుధారాణి, కామర్స్ విభాగం డీన్ ప్రొ. ఆనంద్పవార్, డా.రబీంద్రనాథ్ సోలమన్, ప్రొ. కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.