హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): వీశాట్ 2026-27 ప్రవేశాలకు విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, కల్నల్ ప్రొఫెసర్ పీ నాగభూషణ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజ్ఞాన్ యూనివర్సిటీ ఉద్యోగాలు, పరిశోధనలకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ విజయరాము, డీన్ అడ్మిషన్స్ డాక్టర్ కేవీ కృష్ణకిషోర్, డైరెక్టర్ అడ్మిషన్స్, డిప్యూటీ రిజిస్ట్రార్ గౌరిశంకర్రావు తదితరులు పాల్గొన్నారు.
కోర్ బ్రాంచీలకు కొత్త డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో అడ్మిషన్లు పొందుతున్న విద్యార్థుల ఆలోచనలు క్రమంగా మారుతున్నాయి. కంప్యూటర్సైన్స్ కోర్సులపై ఆసక్తి చూపించిన విద్యార్థులు, తాజాగా కోర్ బ్రాంచీల వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా ఐఐటీ హైదరాబాద్లోని కోర్ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. ఇదే విషయాన్ని జాయింట్ ఇంప్లిమెంటేషన్ రిపోర్టు వెల్లడించింది.