Telangana | హైదరాబాద్ : తెలంగాణలో 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ గడువు విధించారు.
ఈ పోస్టుల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగుకానున్నాయి. స్పెషాలిటీ వైద్య సేవలు పల్లలెకు చేరువ కానున్నాయి. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం.. మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.