వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 31: బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల ప్రవేశాలకు యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ (ఎంఎల్టీ) కోర్సుతోపాటు ప్రభుత్వ అనుమతితో నూతనంగా ప్రవేశపెట్టిన బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియో వస్కులర్ టెక్నాలజీ, బీఎస్సీ రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరో సైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్సెస్, బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, బీఎస్సీ రేడియో థెరపీ టెక్నాలజీ తదితర నూతన కోర్సులకు జనవరి 1 నుంచి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని వర్సీటీ అధికారులు పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం యూనివర్సిటీ తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తుందని తెలిపారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్సైట్ను పరిశీలించాలని వారు సూచించారు.