హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని దవాఖానాల్లో 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు డాక్టర్లు, ఆర్టీసీ హాస్పిటల్లో 7 స్పెషలిస్టు మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 8 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థులు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్బీ) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజులపై ఈ నెల 25 నుంచి పునర్విచారణ ప్రారంభంకానున్నది. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) విచారణ షెడ్యూల్ విడుదల చేసింది. 25న 20 కాలేజీలను విచారణకు ఆహ్వానించారు. మొత్తం 160 కాలేజీలను విచారించనుండగా, సెప్టెంబర్ 3 వరకు పునర్విచారించనున్నారు.