హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మైక్రో బ్రూవరీల (సూక్ష్మ బీర్ల తయారీయూనిట్) ఏర్పాటుకు ఎక్సైజ్‌శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఆబారీ కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్-ఎక్సైజ్‌శాఖ జా యింట్ కమిషనర్ ఖురేషికి వినతిపత్రం అందజేశారు.