హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి తెలంగాణ ఎక్సైజ్ రూల్స్-2012 ప్రకారం.. మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది.
శుక్రవారమే దరఖాస్తుల ప్రక్రియ కూడా మొదలవడంతో మొత్తం 2,620 మద్యం దుకాణాలకు తొలిరోజు 125 దరఖాస్తులు అందినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.