హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ) : ఓ ప్లాట్ విక్రయంలో జరిగిన మోసం వ్యవహారంలో విచారణకు రావాలంటూ సినీనటుడు రాజీవ్ కనకాలకు హయత్‌నగర్ పోలీసులు నోటీసులు జారీచేశారు. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పసుమాముల రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 421లో 230 గజాల ప్లాట్‌ను సినీ నిర్మాత విజయ్‌చౌదరి వద్ద కర్మన్‌ఘాట్ ప్రాంతానికి చెందిన శ్రావణ్‌రెడ్డి, మనోజ్‌రెడ్డి 2023లో, రూ. 70 లక్షలకు కొనుగోలు చేశారు.
ఇటీవల ఆ ప్లాట్‌ను విక్రయించాలని వారు అక్కడికి వెళ్లగా ప్లాట్ కనిపించలేదు. కంగుతిన్న సదరు వ్యక్తులు విజయ్చౌదరిని నిలదీశారు. ఆపై హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఆ ప్లాట్‌ను విజయ్చౌదరికి సినీనటుడు రాజీవ్ కనకాల కుటుంబం విక్రయించినట్టు వెల్లడైంది. విచారణకు రావాల ని ఆయనకు నోటీసులు జారీచేశారు.