ఎల్లారెడ్డిపేట, అక్టోబర్ 4: సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు మండల కేంద్రానికి చెందిన ఇద్దరికి నోటీసులు ఇచ్చి వారి సెల్ఫోన్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం .. పందాగ్రస్టు వేడుకల్లో భాగంగా అప్పటి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బూట్లు వేసుకుని జాతీయ జెం డాను ఆవిష్కరించారని సోషల్ మీడియా లో వైరల్ అయింది.
ఆ పోస్టును రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఎడ్ల సందీప్, ఓ పత్రికా విలేకరి కులేరి కిశోర్, హరిదాస్‌నగర్‌కు చెందిన కుడుకల మహేశ్ వేర్వేరు గ్రూపుల్లో పోస్టు చేశారు. దీంతో డీపీఆర్వో ఆ ముగ్గురిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయగా, ఎడ్ల సందీప్, కులేరి కిశోర్‌ను పోలీసులు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. వారిద్దరి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని నోటీసులు కోర్టులో చూసుకోవాలని పంపించారు. ఇటీవల వారు బీఆర్ఎస్ అనుకూల పోస్టులను పలు గ్రూపుల్లో షేర్ చేయడంతోనే ఫోన్లను స్వాధీనం చేసుకున్నారని ప్రజలు భావిస్తున్నారు.