నాంపల్లి కోర్టులు, మే 29 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పోలీస్ అధికారులు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలైన రెండో బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఒకటవ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి రమాకాంత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. బెయిల్ పిటిషన్లపై విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. రిమాండ్‌లో ఉన్న మరో మాజీ అధికారి రాధాకిషన్‌రావుకు ఇంటి భోజనం అందించేందుకు కోర్టు అనుమతించింది.