హైదరాబాద్/నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 11(నమ స్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో న్యాయస్థానం ఆమె పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీకి సిద్ధమైంది. కేసు విచారణ సందర్భంగా జడ్జి శ్రీదేవి గురువా రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిసారీ వాయిదాలకు ఆమె గైర్హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు.
గురువారం విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, నిందితురాలైన మంత్రి సురేఖ కోర్టుకు హాజరు కాలేదు. ఆమె గైర్హాజరుపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, మినహాయింపు కోరు తూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. ఆ రోజు కూడా సురేఖ హాజరుకాకపోతే నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేయనున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని న్యా యస్థానం ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.