Green India Challenge | హైదరాబాద్ : బీఆర్ఎస్ నాయకుడు, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నిర్వహించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ పీజే నారాయణ్, విద్యార్థులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ మెంబర్లు రాఘవ, కరుణాకర్‌తో పాటు పలవురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థికి వృక్షవేదం పుస్తకంతో పాటు హరితహాసం కార్టూన్లను అందజేశారు.
ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ.. పర్యావరణ పరిక్షణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టడం గొప్ప విషయమన్నారు. ఈ భూమ్మీద ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లడం మంచి విషయమన్నారు.
అనంతరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్ 6.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చెట్లను నాటేలా ప్రోత్సహిస్తామన్నారు.
Honoured to be accompanied by the esteemed Nobel Prize winner @k_satyarthi garu in planting a spaling as part of the #GreenIndiaChallenge 🌿 Together, we sow the seeds of change, nurturing a greener and brighter future for generations to come! Let’s make our planet a better… pic.twitter.com/aoxo8JJAVa
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 22, 2023