గాలోల్ల మాటలు నమ్మొద్దు
తెలంగాణపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని, గాలోళ్ల మాటలు నమ్మొద్దని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్పై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
- బీఆర్ఎస్పై కుట్రలు తిప్పికొట్టాలి
- వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
- రాష్ట్రంపై మోదీ, షా కన్ను పడ్డది
- టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
- రాష్ట్రవ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు
మహబూబ్‌నగర్/పెద్దపల్లి, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/పెద్దమందడి: తెలంగాణపై విపక్షాలు విషం చిమ్ముతున్నాయని, గాలోళ్ల మాటలు నమ్మొద్దని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్పై జరుగుతున్న కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గోపాలసముద్రంలో ఏర్పాటు చేసిన సమ్మేళనానికి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో కలిసి మంత్రి హాజరై మాట్లాడారు. నీళ్లు, విద్య, నిధుల్లో వనపర్తి జిల్లాను రాష్ట్రంలో టాప్‌లో ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంట్, సాగునీరు, గురుకులాలు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు. అన్ని ఇచ్చిన కేసీఆర్ అగ్గువకు దొరికాడని విపక్షాలు కారుకూతలు కూస్తున్నాయని, ఖబడ్దార్! అని మంత్రి ఘాటుగా హెచ్చరించారు. వేలాదిగా తరలివచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని ఎమ్మెల్సీ, వనపర్తి జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. దేశంలో ఇంత అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరూ లేరని, పచ్చని తెలంగాణ మీద నిప్పులు కురిపిస్తున్న వారిని గమనించాలని, వారి కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. అభివృద్ధి చేస్తున్న పార్టీని, నేతలను ప్రజలు ఆశీర్వదించాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నిస్తే .. ఈడీ, సీబీఐలతో వేధింపులు: ఎర్రోళ ్ల శ్రీనివాస్
‘ప్రధాని మోదీ విశ్వగురువు కాదు.. విష గురువు. సుభిక్షంగా ఉన్న తెలంగాణ పచ్చ ని పల్లెలపై మోదీ, అమిత్‌షా కన్నుపడ్డది. అటు దేశ ప్రజలను దోచి తన ఇద్దరు మిత్రు లు అదానీ, అంబానీలకు కట్టపెడుతూ, ఇటు పల్లెల్లో చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఒక్క రూపా యి కూడా ఖర్చు చేయడం లేదు. ఇదేంటంటే.. ఈడీలు, సీబీఐ, ఐటీ కేసుల పేరుతో వేధిస్తున్నారు’ అని టీఎస్ఎంఐడీసీ చైర్మన్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనాలకు ఆయన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

