హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): శ్రీవారి లడ్డూ తయారీలో నందిని నెయ్యి వాడొద్దని టీటీడీ తీర్మానించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్)తో ఉన్న కాంట్రాక్ట్‌ను రెన్యూవల్ చేయొద్దని నిర్ణయించింది. కేఎంఎఫ్ తన నెయ్యి ధరను భారీగా పెంచడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ నిర్ణయంతో 50 ఏండ్లుగా కేఎంఎఫ్ ద్వారా టీటీడీకి సరఫరా అవుతున్న నెయ్యి నేటి నుంచి నిలిచిపోనున్నది. ఈ విషయాన్ని కేఎంఎఫ్ చైర్మన్ భీమానాయక్ ధ్రువీకరించారు. పాత ధరకే నెయ్యిని సరఫరా చేయాలని టీటీడీ కోరిందని, దీన్ని తాము నిరాకరించినట్టు వివరించారు.