రవీంద్రభారతి, ఫిబ్రవరి 28 : వందేండ్ల వరకు దళిత కులాల్లో దేనికి కూడా అన్యాయం జరుగవద్దని, ఏ దళిత వర్గం కూడా బాధపడొద్దనే తన తాపత్రయమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ 76 ఏండ్లల్లో అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ఫలాలు మాలలే అనుభవించారని, దామాషా ప్రకారం మాదిగలకు రిజర్వేషన్ ఫలాలు దక్కక నష్టపోయారని వాపోయారు.
వర్గీకరణ అమలులోకి వస్తే దళితుల్లోని 59 కులాలకు న్యాయం జరగాలన్నదే తన లక్ష్యమని తెలిపారు.