పెట్రోల్, డీజిల్ కొరత లేదు
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అవసరమైన మేరకు ఇంధన నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.
- వదంతులు నమ్మొద్దు.. ఆందోళన వద్దు
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా
హైదరాబాద్, మార్చి 25(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అవసరమైన మేరకు ఇంధన నిల్వలు ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని, వదంతులను నమ్మొద్దని, ఆందోళన చెందవద్దని కోరారు. పెట్రోల్ కొరతపై శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రానున్న మూడు నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు.
డిమాండ్‌కు మించి సరఫరా
సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. డిమాండ్‌కు మించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. బుధవారం 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలో లీటర్లు సరఫరా చేశామని తెలిపారు. దీనికి తోడు అదనంగా 16 వేల కిలో లీటర్ల ఇంధనం నిల్వ ఉంచడంతోపాటు 1200 అదనపు ట్యాంకర్లను వినియోగిస్తున్నామని వెల్లడించారు. కొరత ఉందంటూ వస్తున్న వదంతులతో వినియోగదారులు పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ తీసుకోవడంతో రోజువారీ డిమాండ్ ఒకసారిగా 25 శాతం పెరిగిందని అన్నారు. కొన్ని పెట్రోలు బంక్‌లకు నిర్ణీత సమయానికి ట్యాంకర్లు చెరుకోకపోవడంతో అక్కడ నో-స్టాక్ బోర్డులు పెట్టారని చెప్పారు.
తప్పుడు ప్రచారం నమ్మొద్దుపెట్రోల్ బంకుల డీలర్ల వెల్లడి
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంధన కొరతపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని, ఎక్కడా ఎలాంటి కొరత లేదని పెట్రోల్ బంకుల డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వినోద్ విశ్వనాథ్, ట్రెజరర్ ఎల్వీ కుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ కంపెనీల వద్ద, పెట్రోల్ బంకుల్లో అవసరమైన మేరకు పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని స్పష్టంచేశారు. తప్పుడు వార్తలను నమ్మి పెద్ద ఎత్తున వాహనదారులు బంకులకు వస్తున్నారని, తద్వారా విక్రయాలు సాధారణంతో పోల్చితే 3 రెట్లు పెరిగాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

