ఒకే నేరానికి శిక్షల్లో తేడాలొద్దు.. వేరువేరు శిక్షలు విధించడం వివక్ష : హైకోర్టు
ఒకే రకమైన నేరారోపణల కేసుల్లో వేరువేరు శిక్షలు విధించడం వివక్షే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రెజరీ మెడికల్ బిల్లుల జారీలో అక్రమాలకు పాల్పడిన ట్రెజరీ ఉద్యోగులపై వేరువేరు చర్యలు తీసుకోవడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ నందతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు లేకుండా ట్రెజరీ బిల్లులను మం జూరు చేశారంటూ కరీంనగర్‌కు
- హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఒకే రకమైన నేరారోపణల కేసుల్లో వేరువేరు శిక్షలు విధించడం వివక్షే అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రెజరీ మెడికల్ బిల్లుల జారీలో అక్రమాలకు పాల్పడిన ట్రెజరీ ఉద్యోగులపై వేరువేరు చర్యలు తీసుకోవడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ నందతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతులు లేకుండా ట్రెజరీ బిల్లులను మం జూరు చేశారంటూ కరీంనగర్‌కు చెందిన ఎస్ఎంపీఎం హస్మికి చెల్లించే పెన్షన్‌లో 30శాతం కోత విధిస్తూ గతం లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సమర్ధిస్తూ 2008లో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హస్మి హైకోర్టును ఆశ్రయించారు.
బిల్లుల మంజూరులో పిటిషనర్ పాత్ర ఉన్నదని, ఇదే కేసులో ఒకొకరికీ ఒక్కొక్క విధంగా శిక్షలు విధించడాన్ని సవాల్ చేస్తున్నామని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారు. ఒకరికి ఇంక్రిమెంట్, మరొకరికి పెన్షన్‌లో 2% కోత, పిటిషనర్‌కు 30% కోత విధించడం వివక్షే అవుతుందని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. ఒకే కేసులో వేరువేరు శిక్షలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టంచేసింది. పెన్షన్‌లో 2% కోతను ఏడాదిపాటు విధిస్తూ మరో వ్యక్తికి అమలు చేసిన శిక్షనే పిటిషనర్‌కు అమలు చేయాలని తుది ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

