హైదరాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును హైకోర్టు తప్పుబట్టలేదని, కమిషన్ నివేదికలో కొందరిపై చేసిన నిర్ధారణలనే అభ్యంతరం చెప్పిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. హైకోర్టు తీర్పు అనేది సీబీఐ విచారణకు అడ్డంకి కాబోదని చెప్పారు. కమిషన్ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఎలాంటి చర్య లు తీసుకోరాదని హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సాగునీటి పారుదల ఉన్నతాధికారులతో సమావేశమై ఒక ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
క్లీన్చిట్ ఇవ్వలేదు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తేతెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నేతలకు క్లీన్చిట్ ఇవ్వలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. నోటీసుల జారీ వంటి కొన్ని విధానపరమైన అంశాల్లో లోపాలపైనే స్పందించిందని తెలిపారు. తదుపరి చర్యలను ప్రభు త్వం తీసుకుంటుందని చెప్పారు.