Beetroot | ప్రచారం: బీట్రూట్.. వెజిటబుల్ వయాగ్రాలా పని చేస్తుందని నెట్టింట ప్రచారం జరుగుతున్నది. స్త్రీ, పురుషుల లైంగిక సామర్థ్యాన్ని ఇది పెంపొందిస్తుందన్న వార్త వైరల్ కావడంతో ఆస్ట్రేలియా సూపర్ మార్కెట్లలో బీట్రూట్ కొరత ఏర్పడిందట. యూకేలో టీవీ డాక్టర్ మేఖెల్ మోస్లా బీట్రూట్ వయాగ్రాలా పనిచేస్తుందని చెప్పాడంటూ ఓ వార్త వైరల్‌గా మారింది.
వాస్తవం: బీట్రూట్ వయాగ్రాలా పనిచేస్తుందని డాక్టర్ మోస్లా చెప్పినట్టు కానీ, శాస్త్రీయంగా ఆ విషయం రుజువైనట్లు కానీ ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. బీట్రూట్లో విటమిన్ బీ, సీ, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రక్త ప్రసరణకు ఇవి బాగా దోహదపడతాయి. బీట్రూట్ కామోద్దీపనగా పనిచేస్తుందని రోమన్లు నమ్ముతారు. అక్కడ వారు అందుకోసమే బీట్రూట్ రసాన్ని సేవిస్తారట. అయితే మనం బీట్రూట్ తిన్నప్పుడు, బ్యాక్టీరియా, ఎంజైమ్లతో కూడిన రసాయన ప్రతి చర్యలు బీట్రూట్లోని నైట్రేట్‌ను నైట్రేట్‌గా, తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది లైంగిక సామర్థ్యంపై సానుకూల ప్రభావం చూపొచ్చు.