పాట్నా : బీహార్ శాసన సభ ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఆదివారం చెప్పారు. బీహార్ ప్రజలు ఇప్పటికీ మారాలని కోరుకోకపోతే, తాను వారితోనే కలిసి మరో ఐదేళ్లు పని చేస్తానన్నారు. ప్రభుత్వంలో చేరే ప్రశ్నే లేదన్నారు. తన పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, లేదంటే, ప్రతిపక్షంలో ఉంటుందని చెప్పారు. అవసరమైతే మరో ఎన్నిక జరిగేలా చేస్తానన్నారు.