హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఎన్‌ఎంఏటీ-2025 (నేషనల్ మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్) రిజిస్ట్రేషన్లు నేటి(శుక్రవారం)తో ముగియనున్నట్టు ఎన్ఎంఐఎంఎస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ వెల్లడించింది.
ఎంబీఏ చదవాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. గురువారం ప్రకటన విడుదల చేసింది. రిజిస్ట్రేషన్‌తోపాటు పూర్తి వివరాలకు http://nmat.nmims.edu వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.