Heart Attack | గుండెపోటు అంటే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమైపోయింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఉన్న వాళ్లు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. ఇలాంటి ఘటనలను ఇప్పటికే మనం చాలానే చూస్తూనే ఉన్నాం. తాజాగా నిజామాబాద్లో ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గౌతమ్నగర్కు చెందిన యువకుడు బుధవారం ఉదయం క్రికెట్ ఆడేందుకు బయటకు వెళ్లాడు. అమ్మ వెంచర్లో క్రికెట్ ఆడుతుండగా ఛాతిలో నొప్పి వస్తుందని కిందపడిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే విజయ్ మృతిచెందాడు.