Nizamabad | నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్.. ఒకే రాత్రిలో నాలుగుచోట్ల చోరీలు
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. ఒకే రాత్రి నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడింది.
Nizamabad | వినాయక నగర్, జూలై 11: నిజామాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హల్చల్ సృష్టించింది. ఒకే రాత్రి నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాటా సుమోలో వచ్చిన నలుగురు దొంగలు ముందుగా నిర్మల్ జిల్లాలోని ఓ అపార్ట్మెంట్లో దోపిడీకి పాల్పడ్డారు. అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించి, తెల్లవారుజామున ఆర్మూర్ పట్టణంలోని ఓ మెడికల్ షాప్ షట్టర్ ధ్వంసం చేసి అందులోని సుమారు లక్షన్నర నగదును దోచుకున్నారు.
అనంతరం ఆ దొంగల ముఠా తమ వాహనంలో తెల్లవారుజామున 4.55 గంటల వరకు శ్రీనగర్ కాలనీకి చేరుకుని.. లక్ష్మీ అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతాడు తెంపుకుని పరారయ్యారు. ఆ తర్వాత ఉదయం 5.25 గంటల వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడుతో పాటు ఒక చెవికమ్మను లాక్కున్నారు. మరో చెవికమ్మ లాక్కునే ప్రయత్నం చేస్తుండగా బాధితురాలి కేకలు విని ఆమె భర్త బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో వారు టాటా సుమో వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర దోపిడీ ముఠా ఈ చోరీలకు పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఘటనాస్థలిని పరిశీలించిన నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య ఘటనాస్థలిని క్షుణ్నంగా పరిశీలించారు. బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు కీలక సూచనలు చేశారు. ఘటన జరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాలని.. నిందితులను వేగంగా పట్టుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

