Road Accident | హైదరాబాద్ నగర పరిధిలోని ఎస్ఆర్నగర్లో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. రాత్రి బైక్‌పై వెళ్తున్న యువకుడిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని నిర్మల్‌కు చెందిన నిఖిల్‌గా గుర్తించారు. నిఖిల్ అమీర్‌పేటలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో హైదరాబాద్‌కు వచ్చి సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్న నిఖిల్‌ను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిఖిల్ మృతితో నిర్మల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.