TS Tenth Results | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 86.80 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, బాలికలు హవా సృష్టించారు. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత శాతం నమోదు సాధించగా, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా బాలికలు బాలుర కంటే 3.85 శాతం అధికంగా ఉత్తీర్ణత నమోదు చేశారు.
పది ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పది ఫలితాల్లో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 99 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. కాగా ఈ జిల్లాల్లో 59.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Click Here: TS SSC RESULTS 2023