శ్రీశైలంలో నీళ్లున్నా.. రైతులకు కన్నీళ్లేనా?
‘శ్రీశైలం జలాశయంలో ఇప్పటికే 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.. పంపుల ద్వారా 25 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉన్నది. నిత్యం మూడు పంపులు నడిపి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయవచ్చు.. రిజర్వాయర్లు, కాలువలకు చేరితే వారబందీ పద్ధతిలో సాగునీరు అందిచొచ్చు.
- డ్యామ్‌లో 80 టీఎంసీలు ఉన్నయ్
- ఇంకా 25 టీఎంసీలు వాడుకోవచ్చు
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- వనపర్తి ‘ఇరిగేషన్’ఎదుట ధర్నా
- పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు ఆల, బీరం
వనపర్తి టౌన్, నవంబర్ 11 : ‘శ్రీశైలం జలాశయంలో ఇప్పటికే 80 టీఎంసీల నీళ్లు ఉన్నాయి.. పంపుల ద్వారా 25 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉన్నది. నిత్యం మూడు పంపులు నడిపి ఒక టీఎంసీ నీటిని ఎత్తిపోయవచ్చు.. రిజర్వాయర్లు, కాలువలకు చేరితే వారబందీ పద్ధతిలో సాగునీరు అందిచొచ్చు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆలోచించడంలేదు.. పాలమూరు ఎత్తిపోతల పంపులు నిర్విరామంగా నడుపడం రేవంత్‌కు చేతగావడం లేదు.. నీళ్లు ఇవ్వలేని అసమర్థ సర్కార్‌తో రైతులు అరిగోస పడ్తున్నారు’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు.
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ఇంజినీరింగ్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యలో మెరుపు ధర్నా చేపట్టారు. దేవరకద్ర, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్తో కలిసి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు సింగిరెడ్డి నివాసం నుంచి ఇరిగేషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డ రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే ప్రాజెక్టులు నింపి సాగునీరు అందిస్తారని రైతులు ఆశించారని తెలిపారు. కానీ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తారనుకోలేదని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని కేఎల్ఐ పంపుల నుంచి ఎత్తిపోస్తే కాలువల ద్వారా పారి వనపర్తి, చిన్నంబావి, వీపనగండ్ల, పెద్దమందడి మండలాల్లోని పంటలకు నీరు అందుతుందని తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎర్రటి ఎండలోనూ చెరువులు, వాగులు అలుగులు పారించిన విషయాన్ని గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వ వైఫల్యంతో ఆంధ్రా పాలకులు నదీ జలాలను తరలించుకుపోతున్నారని, అయినా ఇక్కడి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు సోయి లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కేఎల్ఐ పంపులు నిర్వీరామంగా నడుపాలని, ఆరుతడి పంటలు వేసుకున్న రైతులకు నీళ్లిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టు కింద 11 క్యూసెక్కుల నీరు రీజనరేట్ అవుతుందని, కర్ణాటక నుంచి నీరు వస్తుందని తెలిపారు. పాలమూరు లిఫ్ట్ పంపులు నడిపి ఏదుల, కరివెన రిజర్వాయర్లలో 5 టీఎంసీల నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి త్వరగా ఉత్తరాలు పంపి పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
కర్ణాటకకు పోయి ఏం చేసిన్రు?
మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కర్ణాటకకు యాత్రకు పోయి చుక్క నీరు తీసుకురాలేదని మాజీ ఎమ్మెల్యే బీరం దుయ్యబట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు నమ్మి రైతులు మోసపోయారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రేవంత్ మూడేండ్ల పాలన అబద్ధపు హామీలతో కొనసాగిందని విమర్శించారు. పాలమూరు జిల్లాకు ఒక్క పనీ చేయలేదని ధ్వజమెత్తారు. కేఎల్ఐ, జూరాలకు నీళ్లు ఇచ్చి పాలమూరు జిల్లాను కాపాడాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

