హైదరాబాద్, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ): ఓటమి భయంతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతూ హింసను ప్రోత్సహిస్తున్నారని మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత పదేండ్లుగా ఎకడా హింసకు తావివ్వలేదని తెలిపారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డలు రాష్ట్రం కోసం తమకు తాము బలిదానాలు చేసుకున్నారు తప్ప, దాడులు, హింసకు పాల్పడలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు నొటికొచ్చినట్టు మాట్లాడుతన్నారని మండిపడ్డారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం హేయమైన చర్యగా అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణ సాయుధ పోరాటంలో రైతాంగాన్ని, 1969 ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులను బలితీసుకున్నదని గుర్తుచేశారు. కాంగ్రె స్ 2001 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో బిడ్డల బలిదానాలకు కారణం అని మండిపడ్డారు. కాంగ్రెస్ గతంలో అధికారం కోసం పాతబస్తీలో మతఘర్షణలు సృష్టించి వందల మందిని పొట్టనబెట్టుకున్నదని ఆరోపించారు. ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలు గెలుస్తామని చెప్పారు.
తాను రెండు జాతీయ పార్టీలను, రెండు ప్రాంతీ య పార్టీలను చూశానని నాగం జనార్దన్‌రెడ్డి చెప్పా రు. కాంగ్రెస్ ది ఆర్టిఫిషియల్ హైప్ అని, దాని గ్రాఫ్ వేగంగా పడిపోతున్నదన్నారు. ఐదేండ్లు పార్టీలో ఉన్న వారికి టికెట్లివ్వాలి.. కానీ పారాచ్యూట్ నేతలకు ఇచ్చారని ఆరోపించారు. సునీల్ కనుగోలా? కొనుగోలా? ఆయన పాపులారిటీ సర్వే ఏంటో అర్థం కాదని ఎద్దేవాచేశారు. నాగంకు పాపులారిటీ లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యత్వంలేని 30 మందికి టికెట్లు ఇచ్చారని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ గెలుపు ఖాయమని వెల్లడించారు.
బీఆర్ఎస్ గెలుపు కోసం అంతా కలిసి పనిచేస్తామని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు సేవ చేయడం బీఆర్ఎస్తోనే సాధ్యం అని భావించానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో, నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని ప్రశంసించారు. కేసీఆర్ అప్పు డూ, ఇప్పుడూ ఒకేలా ఉన్నారన్నారు. వనపర్తిలో నిరంజన్‌రెడ్డికి గతం కన్నా ఎకువ మెజార్టీ వస్తుందని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే వీఎం అబ్రహాం, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, సాట్స్ మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ నేత నాగం తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.