రైతుభరోసా ఒక డ్రామా
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా పథకం ఒక డ్రామాగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వానికి తెలియకుండానే దాదాపు మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు నకిలీ సందేశాలు రావడం సరార్ ఘోర వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. భూభారతి పేరుతో ఇప్పటికే అన్నదాతల భూములను నిషేధిత జాబితాలోకి నెట్టారని, ఇప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
- కాంగ్రెస్ తెచ్చిన మానవ నిర్మిత కరువిది
- మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా పథకం ఒక డ్రామాగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రభుత్వానికి తెలియకుండానే దాదాపు మూడు లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు నకిలీ సందేశాలు రావడం సరార్ ఘోర వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. భూభారతి పేరుతో ఇప్పటికే అన్నదాతల భూములను నిషేధిత జాబితాలోకి నెట్టారని, ఇప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల సమాచారాన్ని గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సందేశాలు తాము పంపలేదని ప్రభుత్వం పోలీసులకు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
ప్రస్తుత యాసంగికి సంబంధించిన రైతుభరోసా ఇస్తరో లేదో ప్రభుత్వం తక్షణమే స్పష్టం చేయాలని, కరువు నేపథ్యంలో రైతులకు ఇచ్చే సహాయంపై సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాం లో గర్వంగా బతికిన రైత న్న.. నేడు సాయం కోసం ఎదురుచూసే దీనస్థితికి చేరాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరత, విద్యుత్తు కోతల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పత్తి, వరి, మకజొన్న, కందులు వంటి పంట లు సుమారు 28 లక్షల ఎకరాల్లో ఎండిపోయాయని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 50 వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

