కండ్లు తెరిచి కరువును చూడు!
‘అయ్యా, ఎమ్మెల్యే గారు.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఎక్కడా ఎకరా పొలం ఎండిపోలేదంటివి. బుధవారం విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటిస్తివి.. ఇదిగో ఈ పంట మీ కాంగ్రెస్ కార్యకర్త కావలి వెంకటేశ్‌ది. ఇది ఎండిన పొలం కాదా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని రైతులు ప్రశ్నించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎండిన పంటలు పరిశీలించేందుకు కౌకుంట్ల మండలానికి వచ్చారు.
- ఇదిగో పంట ఎండింది..
- కాంగ్రెస్ కార్యకర్త సాగు చేసిందే..
- ఎక్కడ కూడా ఎకరా ఎండలేదంటిరి
- దేవరకద్ర ఎమ్మెల్యేకు రైతుల సవాల్
మూసాపేట, నవంబర్ 5 : ‘అయ్యా, ఎమ్మెల్యే గారు.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ఎక్కడా ఎకరా పొలం ఎండిపోలేదంటివి. బుధవారం విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటిస్తివి.. ఇదిగో ఈ పంట మీ కాంగ్రెస్ కార్యకర్త కావలి వెంకటేశ్‌ది. ఇది ఎండిన పొలం కాదా?’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డిని రైతులు ప్రశ్నించారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎండిన పంటలు పరిశీలించేందుకు కౌకుంట్ల మండలానికి వచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మాజీ ఎమ్మెల్యేకు తమ బాధలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. కౌకుంట్ల మండలం ముచ్చింతల శివారులో కాంగ్రెస్ కార్యకర్త కావలి వెంకటేశ్ ఆరు ఎకరాల్లో వరి సాగు చేయగా, నీళ్లు లేక పూర్తిగా ఎండిపోయిందని తెలిపారు. తాము ఆయన పొలంలోనే ఉండి మాట్లాడుతున్నామని, దీనికి ఎమ్మెల్యే స్పందించాలని సవాల్ విసిరారు. పంట ఎండిపోయి రైతులు కష్టాలు పడుతుంటే ఎమ్మెల్యే చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. వీలైతే క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంటలను చూసి కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అబద్ధాలు వల్లె వేయడం మానుకోండి..
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాము రైతుల పక్షాన నిలబడి వాస్తవాలు మాట్లాడితే స్థానిక ఎమ్మెల్యే మరుసటి రోజు వాట్సాప్ గ్రూపుల్లో అవన్నీ అభూత కల్పనలు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలోనూ దేవరకద్రలో ఎకరా పంట ఎండలేదని చెప్పడం విడ్డూర మని అన్నారు. ముచ్చింతలలో కాంగ్రెస్ కార్యకర్త వెంకటేశ్‌కు సంబంధించిన వరి పంటనే ఎండిపోయిందని, దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉన్న వ్యక్తి క్షేత్రస్థాయిలో పరిశీలించి మాట్లాడాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

