ఖైరతాబాద్, నవంబర్ 5: డయాలసిస్ ప్రక్రియలో కీలకంగా నిర్వహించే ఆర్టీరియో వీనస్ ఫిస్టులా శస్త్రచికిత్సల్లో నిమ్స్ వెయ్యి మార్కును దాటింది. డయాలసిస్ రోగులకు రక్తాన్ని శుద్ధి చేసేందుకు రక్తనాళాల్లో రెండు రకాల నీడిల్స్ను ఆర్టీరియో వీనస్ ఫిస్టులా శస్త్రచికిత్స విధానంతో అమర్చుతారు.
నిమ్స్ వాస్క్యులర్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సందీప్ మహాపాత్ర నేతృత్వంలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు పది నెలల్లో వెయ్యికిపైగా ఆర్టిరీయో వీనస్ ఫిస్టులా శస్త్ర చికిత్సలు నిర్వహించి రికార్డు సృష్టించారు. ఇది నిమ్స్ చరిత్రలోనే మొదటిదని వైద్యులు చెబుతున్నారు. ఈ మేరకు మంగళవారం వెయ్యి ఏవీ ఫిస్టులా శస్త్రచికిత్సలు చేసిన వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అభినందించారు.