ఖైరతాబాద్, నవంబర్ 1: నిమ్స్ దవాఖానలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో పిల్లలకు ఈ నెల 9 వరకు ఉచిత స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించనున్నట్టు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పార్వతి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణమొర్రి, క్రానియో ఫేషియల్ వైకల్యాలు, పుట్టుకతో వచ్చే పక్షవాతం, కాలిన, ప్రమాదవశాత్తు ఏర్పడిన గాయాల మచ్చలతో బాధపడుతున్న 12 నుంచి 14 ఏండ్ల లోపు చిన్నారులకు పూర్తిగా ఉచితంగా చికిత్సలు అందిస్తామని తెలిపారు. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 2 గంట ల మధ్య పాత ఔట్ పేషెంట్ బ్లాక్లో రిజిస్ట్రేషన్ చేసుకొని రూమ్ నం.8లో సంప్రదించాలని పేర్కొన్నారు.